
న్యూఢిల్లీ: మనదేశ ఫారెక్స్నిల్వలు ఈ నెల ఆరో తేదీతో ముగిసిన వారంలో 5.17 బిలియన్ డాలర్లు పెరిగి 696.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం తెలిపింది. అయితే గత నెల 30తో ముగిసిన వారానికి మొత్తం నిల్వలు 1.237 బిలియన్ డాలర్లు తగ్గి 691.485 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
సెప్టెంబర్ 2024 చివరి నాటికి ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జూన్ 6తో ముగిసిన వారానికి, విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 3.47 బిలియన్ డాలర్లు పెరిగి 587.68 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ వారంలో బంగారు నిల్వల విలువ 1.58 బిలియన్ డాలర్లు పెరిగి 85.88 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.