నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న హైపర్ టెన్షన్

 నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న హైపర్ టెన్షన్

ఎవరైనా కొంచెం కోపంగా మాట్లాడితే చాలు... ఏం బీపీ వచ్చిందా... అని అడుగుతారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరైనా వాడేస్తున్నారు. కానీ.. ఈ మాటల్లో నిజం ఉందనిస్తోంది.  కోపం వచ్చినప్పుడో... సరదాగానో వాడుతున్నా.. చాలామందిలో బీపీ పెరుగుతోందని అంటున్నారు డాక్టర్లు. అధిక రక్త పోటు.. ఇది పెద్ద జబ్బేమీ కాదు. కానీ.. నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాల మీదకు తెస్తుంది. హైబీపీ అంటే.. గతంలో వయసు మళ్లిన వాళ్లలో ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు... వయసుతో సంబంధం లేకుండా.. హైపర్ టెన్షన్ అందరినీ చుట్టేస్తోంది. కొవ్వు పదార్ధాలను తరచుగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి రక్తపోటుకు కారణాలని డాక్టర్లు చెబుతున్నారు. 
 
అధిక రక్త పోటు వస్తే.. తరచూ బీపీ చెక్ చేసుకుంటూ.... మెడిసన్ వాడాలి. కానీ.. చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో.. బీపీ పెరిగి.. హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి వచ్చి.. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. షుగర్, బీపీ లాంటి జబ్బులకు ఎప్పుడూ కేర్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.  మెడిసన్ వాడటంతో  పాటు.. లైఫ్ స్టైల్ లో మార్పులు తేవాలని సూచిస్తున్నారు. వ్యాయామం, యోగా, ఆహార నియమాలు పాటిస్తూ, ఒత్తిడి తగ్గించుకుంటే.. అధిక రక్త పోటు కంట్రోల్ కి వస్తుందని చెబుతున్నారు. 


 
వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా.. గ్లోబల్ హాస్పిటల్ GHMC పరిధిలో ఓ సర్వే నిర్వహించింది. అనేక రంగాల్లో  పని చేస్తున్న 25 నుంచి 50 యేళ్ల వయస్సున్న  5 వేల మందిపై సర్వే చేసింది.  హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వాళ్లు 40 శాతం ఉంటే... దీనికి దగ్గరగా ఉన్నవాళ్లు 39 శాతం, నార్మల్ గా ఉన్నవాళ్లు 19 శాతం మాత్రమే ఉండటం కలవర పెడుతోందంటున్నారు డాక్టర్లు. హైపర్ టెన్షన్ ను ముందుగా స్క్రీనింగ్ చేయాలన్న ఉద్దేశ్యంతో.. వైద్యశాఖ NCD స్క్రీనింగ్ ను పెంచింది. 90లక్షల మందిని పరీక్షిస్తే.. 13 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్లు తేలింది. రాబోయే రెండు మూడు నెలల్లో.. ప్రతి ఒక్కరికీ బిపి, షుగర్ టెస్ట్ లు చేయిస్తామంటోంది వైద్యశాఖ. దీనికి 33 కోట్ల నిధులు కూడా కేటాయించారు. సిటీ పరిధిలోనే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్లు ఎక్కువగా ఉన్నారంటున్నారు మంత్రి హరీష్ రావు. హై బీపీ మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. లైఫ్ స్టైల్ మార్చుకుంటూ బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలంటున్నారు డాక్టర్లు.  

మరిన్ని వార్తల కోసం..

ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం

మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం