రేగుపండు తినాల్సిందే

V6 Velugu Posted on Jan 20, 2022

సీజనల్ ఫ్రూట్స్​తో ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ సీజన్ లో దొరికే రేగుపండ్లు తినకపోతే ఎలా? వీటితో మన శరీరానికి చాలా మేలు అంటున్నారు న్యూట్రిషనిస్ట్స్. రక్తం తక్కువ ఉన్నవాళ్లు ఈ పండు తినడం మంచిది. ఈ పండ్లలో ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. ఆల్కలాయిడ్స్  రక్తాన్ని శుభ్రం చేస్తాయి.

రేగుపండులో ఆరెంజెస్​లో ఉండేదానికన్నా ఎక్కువ విటమిన్–సి ఉంటుంది. ఇందులోని యాంటీబయాటిక్స్ తరచుగా రోగాల బారిన పడకుండా కాపాడతాయి. విటమిన్ ఎ స్కిన్ గ్లో అయ్యేలా చేస్తుంది. దీనిలో ఉన్న క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. ఎదుగుతున్న పిల్లలకు వీటిని తినిపిస్తే శరీరం దృఢంగా తయారవుతుంది. ఈ పండులో ఎక్కువ ప్రొటీన్స్, ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఈ పండుని తినొచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ బ్రెయిన్ ఫంక్షన్స్ ని మెరుగుపరిచి, నిద్ర మంచిగా పట్టేలా చేస్తాయి.

Tagged Health Tips, Jujube Fruit, Jujube Benefits, Healthy Fruits

Latest Videos

Subscribe Now

More News