రెండో ఇన్నింగ్స్ లో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోర్ 31 వద్ద ఔటయ్యాడు. ఏడో ఓవర్లో రెండో పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా ఔటయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. పూజారా 13, కోహ్లీ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 59 పరుగులు కావాలి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263, రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది, భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసింది.
