IND vs AUS Final: సచిన్ తరువాత కోహ్లీనే.. పాంటింగ్ రికార్డు బద్దలుకొట్టిన విరాట్

IND vs AUS Final: సచిన్ తరువాత కోహ్లీనే.. పాంటింగ్ రికార్డు బద్దలుకొట్టిన విరాట్

ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌ పోరులో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు బద్దలుకొట్టాడు. ఈ  మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో రాణించిన కోహ్లి(54; 63 పరుగులు 4 ఫోర్లు) వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు(765) చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే, వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించాడు.

పాంటింగ్ 42 ఇన్నింగ్స్‌లలో 1743 పరుగులు చేయగా, కోహ్లీ 37 ఇన్నింగ్స్‌లలో 1783 పరుగులు చేశాడు. దీంతో రన్ మెషిన్.. పాంటింగ్ ను వెనక్కునెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ 44 ఇన్నింగ్స్‌లలో 2278 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.  

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు

  • సచిన్ టెండూల్కర్: 2278 పరుగులు (44 ఇన్నింగ్స్‌లు) 
  • విరాట్ కోహ్లీ:1782 పరుగులు (37 ఇన్నింగ్స్‌లు)
  • రికీ పాంటింగ్: 1743 పరుగులు (42 ఇన్నింగ్స్‌లు)
  • రోహిత్ శర్మ: 1575 పరుగులు (28 ఇన్నింగ్స్‌లు)
  • కుమార సంగక్కర: 1532 పరుగులు(35 ఇన్నింగ్స్‌లు)
  • డేవిడ్ వార్నర్: 1520 పరుగులు (28 ఇన్నింగ్స్‌లు)