జడేజా దెబ్బకు ఆస్ట్రేలియా 113కే ఆలౌట్

జడేజా దెబ్బకు ఆస్ట్రేలియా 113కే ఆలౌట్

రెండో టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత బౌలర్ల స్పిన్ ధాటికి  చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోర్  61/1 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 114 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ విజయం సాధించాలంటే  115 పరుగులు  చేయాలి.

 స్పిన్నర్లు  జడేజా 7 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లతో  విశ్వరూపం చూపించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లను పరుగులేమి చేయకుండానే వెనువెంటనే పెవిలియన్ కు పంపారు.  ఓవర్ నైట్ స్కోర్  61/1 పరుగులతో ఆట స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ 43, లబుషేన్ 35 పరుగులు మినహా మిగతావారెవరూ పెద్దగా రాణించలేదు.   భారత స్పిన్నర్లు జడేజా7, అశ్విన్ 3 వికెట్లు తీశారు.  ఫస్ట్ ఇన్నింగ్స్ లో  ఆసీస్ 263,  భారత్ 262 పరుగులు చేసింది.