టెస్టుల్లో 28వ సెంచరీ చేసిన కోహ్లీ

టెస్టుల్లో 28వ సెంచరీ చేసిన కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఫోర్త్ టెస్టులో టీమిండియా అదగొడుతోంది. ఇక పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ  సెంచరీతో చెలరేగాడు. 2019  నవంబర్ లో బంగ్లాదేశ్ పై చివరి సారిగా టెస్టు  సెంచరీ చేసిన కోహ్లీ నిరీక్షణకు తెరదించాడు.  241 బంతుల్లో సెంచరీ  బాదాడు.   టెస్టుల్లో కోహ్లీకి ఇది  28వ సెంచరీ.  అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 75వ సెంచరీ.  కోహ్లీ ఇప్పటి వరకు టెస్టుల్లో 28, వన్డేల్లో 46, టీ20ల్లో ఒక సెంచరీ చేశాడు.

ప్రస్తుతానికి టీమిండియా స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 400 పరుగులతో ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ 100, అక్షర్ పటేల్ 5 ఉన్నారు. టీమిండియా ఇంకా 80 పరుగుల వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
 

మరిన్ని వార్తలు