India vs Nepal: పర్వాలేదనిపించిన నేపాల్ బ్యాటర్లు.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

India vs Nepal: పర్వాలేదనిపించిన నేపాల్ బ్యాటర్లు.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం

పాకిస్తాన్ చేతిలో 104 పరుగులకే కుప్పకూలిన నేపాల్ బ్యాటర్లు.. బలమైన ఇండియా బౌలింగ్ లైనప్‌ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆ జట్టు ఓపెనర్ ఆసిఫ్ షేక్ హాఫ్ సెంచరీతో రాణించగా.. చివరలో సొంపాల్ కమీ 48 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నేపాల్ బ్యాటర్లు  త‌మ అస‌మాన‌ పోరాట‌ప‌టిమ‌తో ఆక‌ట్టుకున్నారు. ఓపెన‌ర్ అసిఫ్ షేక్‌(58) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. తద్వారా టీమిండియాపై ఫిఫ్టీ బాదిన తొలి నేపాల్ క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఒక‌ద‌శ‌లో భారత ఆల్ రౌండర్ ర‌వీంద్ర‌ జ‌డేజా దెబ్బ‌కు నేపాల్ స్వల్ప వ్యవధిలోనే మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. భీమ్ ష‌ర్కి (7),రోహిత్ పౌడెల్(5), కుశాల్ మ‌ల్లా(2)ను జ‌డ్డూ పెవిలియ‌న్ పంపి త్వరగానే  ఇన్నింగ్స్ ముగించేలా కనిపించాడు. అయితే.. గుల్ష‌న్ ఝా(23)తో జ‌త‌ క‌లిసి అసిఫ్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అయితే అతడు ఔట్ అయ్యాక.. నేపాల్ స్కోర్ మంద‌గించింది.

చివరలో సొంపాల్ కమీ(48), దేవేంద్ర సింగ్ ఐరీ(29) జట్టును ఆదుకున్నారు. ఓవర్ కు మూడు.. నాలుగు చొప్పున పరుగులు చేస్తూ.. జట్టును గౌరవప్రదమైన స్కోర్ అందించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా.. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ తలా వికెట్ తీసుకున్నారు.