
జైపూర్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జైపూర్ వేదికగా వచ్చే బుధవారం ఫ్యాన్స్ మధ్యలో జరగనుంది. ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం కెపాసిటీ 25 వేలు కాగా పూర్తి స్థాయిలో ఫ్యాన్స్‌ను మ్యాచ్‌కు అనుమతిస్తామని ఆర్గనైజర్స్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోని వారికి కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వారు కరోనా నెగెటివ్ రిపోర్టు(48 గంటలలోపు పొంది ఉండాలి)తో రావాలి. మాస్కు మాత్రం తప్పనిసరి చేశారు. మాన్‌సింగ్ స్టేడియంలో ఎనిమిదేళ్ల తర్వాత జరగనున్న ఈ ఇంటర్నేషనల్ టీ20.. ఇండియాలో కరోనా ఎంటర్ అయ్యాక ఎలాంటి ప్రోటోకాల్స్ లేకుండా జరుగుతున్న తొలి మ్యాచ్ కానుంది. గతంలో ఇండియా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 50 శాతం మంది ఫ్యాన్స్‌ను అనుమతించారు.