IND vs NZ: కివీస్‍కు సవాల్ విసురుతున్న భారత పేసర్లు.. 2 వికెట్లు డౌన్

IND vs NZ: కివీస్‍కు సవాల్ విసురుతున్న భారత పేసర్లు.. 2 వికెట్లు డౌన్

వన్డే వరల్డ్ కప్ 2023లో రెండు అగ్రశ్రేణి జట్ల(భారత్, న్యూజిలాండ్) మధ్య  కీలక పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఫామ్‌లో ఉన్న కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే(0) కాగా, మరో ఓపెనర్ విల్ యంగ్(17) పరుగులకే పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోర్.. 34/2. 

Also Read :- టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇండియా.. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లను బుమ్రా, సిరాజ్ జోడి బెంబేలెత్తించారు. తొలి ఓవర్ మెయిడిన్ చేయగా.. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఆపై సిరాజ్ తన తదుపరి ఓవర్‌లోనే కాన్వే(0)ను ఔట్ చేశాడు. దీంతో తొమ్మిది పరుగులకే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం షమీ తన తొలి ఓవర్ మొదటి బంతికే యంగ్(17) బౌల్డ్ చేశాడు. డారీ మిచెల్(7), రచిన్ రవీంద్ర (6) క్రీజులో ఉన్నారు.