
ఆసియా కప్ ఫైనల్ క్లాష్ కు రంగం సిద్ధమైంది. సీరీస్ లో కంటిన్యూగా ఆరు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదున్న ఇండియా.. చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు లీగ్ దశలో ఓటమికి బదులు తీర్చుకోవాలని పాక్ కసిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 28) జరగనున్న మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండనుంది. అయితే ఈ రెండు ప్రత్యర్థులు ఆసియా కప్ ఫైనల్ లో 41 ఏళ్ల తర్వాత ఢీకొంటున్నాయి. ఈ గ్యాప్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఆసియా కప్ హిస్టరీలో 8 టైటిళ్లతో ఇండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ఛాంపియన్ గా నిలిచింది. ఈ సారి ఫైనల్ కు చేరిన ఇండియా ఆడిన ఆరు మ్యాచుల్లో ఏ ఒక్కటీ ఓడిపోకుండా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది. పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఓడగా ఆ - రెండూ ఇండియాపైనే కావడం గమనార్హం.
ఇండియా, పాకిస్తాన్ టీమ్ లు.. ఆసియా క్రికెట్‌లో రెండు అతిపెద్ద పవర్‌హౌస్ లు అయినప్పటికీ, ఫైనల్‌లో ఎదుర్కోకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే ప్రస్తుతం ఫైనల్ క్లాష్ కు రెడీ అయిన సందర్భంగా.. ఈ 41 ఏళ్ల గ్యాప్ లో ఈ రెండు టీమ్ ల మధ్య జరిగిన పర్ఫామెన్స్ గురించి తెలుసుకుందాం.
ఆసియా కప్ 1984:
1984లో జరిగిన తొలి ఆసియా కప్‌లో -ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక.. మూడు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. -ఈ టోర్నమెంట్‌లో ఇండియా రెండు గేమ్స్ లోనూ గెలిచి ఫస్ట్ ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్ లో పాకిస్తాన్‌పై 54 పరుగుల తేడాతో విజయం సాధిం ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది.
ఆసియా కప్ 1986:
శ్రీలంక టీమ్ తో రిలేషన్స్ దెబ్బతిన్న కారణంగా ఇండియా టోర్నమెంట్‌లో పాల్గొనడానికి నిరాకరించింది. దీంతో 1986 ఆసియా కప్ వివాదాస్పదమైంది. స్థానంలో బంగ్లాదేశ్ మూడవ జట్టుగా ఆడింది. పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధించాయి, ఇందులో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో గెలిచి తమ మొదటి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Also Read : ఆసియాకప్ ఫైనల్కు ముందు ఇండియాకు షాక్
ఆసియా కప్ 1988:
1988లో ఇండియా ఆసియా కప్‌కు తిరిగి వచ్చింది. బంగ్లాదేశ్‌ను చేర్చుకోవడంతో మొత్తం నాలుగు జట్లు ఆసియాకప్ లో పాల్గొన్నాయి. ఇండియా, పాక్ గ్రూప్ దశలో తలపడ్డాయి. ఇందులో ఇండియా మూడు గేమ్ లలో రెండు గెలిచి ఫైనల్‌కు చేరుకుంటే, పాక్ ఇండియా, శ్రీలంక రెండింటిపై ఓడిపోయి గ్రూప్ దశలోనే ఎగ్జిట్ అయ్యింది. ఫైనల్‌లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఇండియా సెకండ్ ఆసియా కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఆసియా కప్ 1990/91:
ఈ సీజన్ లో ఇండియా, శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది 3వ టైటిల్ సొంతం చేసుకుంది. గ్రూప్ స్టేజ్ లోనే ఇండియా చేతిలో ఓడిన పాక్..ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
ఆసియా కప్ 1995:
ఈ ఎడిషన్‌లో ఇండియా, పాక్ , శ్రీలంక సమాన పాయింట్లు సాధించాయి. నెట్ రన్ రేట్ కారణంగా ఇండియా, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. గ్రూప్ దశలో, పాకిస్తాన్ భారతదేశాన్ని 97 పరుగుల తేడాతో ఓడించింది కానీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది పాక్. ఫైనల్ లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఇండియా నాలుగో టైటిల్‌ను గెలుచుకుంది.
ఆసియా కప్ 1997:
ఈ సీజన్ లో కూడా ఇండియా , శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఫైనల్‌లో శ్రీలంక ఇండియాపై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది.
ఆసియా కప్ 2000:
గ్రూప్ స్టేజ్ లో పాకిస్తాన్ .. ఇండియాను 44 రన్స్ తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకోగా.. ఇండియా ముందుగానే టోర్నీ నుంచి ఎగ్జిట్ అయ్యింది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి పాక్ తొలి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఆసియా కప్ 2004:
సూపర్ ఫోర్‌లో భారత్, పాక్ తలపడగా.. పాకిస్తాన్ ఇండియాపై 59 రన్స్ తో గెలిచింది. కానీ శ్రీలంక పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉండటంతో.. ఫైనల్‌లో ఇండియాతో శ్రీలంక గెలిచింది.
ఆసియా కప్ 2008:
సూపర్ ఫోర్ దశలో ఇండియా, పాక్ రెండూ తలపడ్డాయి. గ్రూప్ దశలో పాక్ ను ఆరు వికెట్ల తేడాతో ఇండియా ఓడించింది. కానీ సూపర్ ఫోర్ స్టేజ్ లో శ్రీలంకను ఓడించలేక పాకిస్తాన్ టైటిల్ పోటీ నుండి ఎగ్జిట్ అయ్యింది. అయితే ఫైనల్‌లో శ్రీలంక భారత్‌ను ఓడించి మరోసారి టైటిల్ గెలుచుకుంది.
ఆసియా కప్ 2010:
శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన ఈ సీరీస్ లో.. ఇండియా పాక్ మధ్య క్లాసిక్ థ్రిల్లర్ మ్యాచ్ జరిగింది. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో ఇండియా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, పాకిస్తాన్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఈ టోర్నీలో శ్రీలంకను ఓడించి ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆసియా కప్ 2012:
బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా-పా హోరాహోరీగా తలపడ్డాయి. పాక్ నిర్దేశించిన 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా... ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే టైటిల్ మ్యాచ్‌ను తిరస్కరించడంతో గ్రూప్ పాయింట్ల ఆధారంగా భారత్ ఓడిపోయింది. చివరికి ఫైనల్ లో బంగ్లాదేశ్‌పై ఫాక్ గెలిచి కప్ సొంతం చేసుకుంది.
ఆసియా కప్ 2014:
ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఇండియా ఎగ్జిట్ అయ్యింది. హోరాహోరీ మ్యాచ్‌లో పాకిస్తాన్ గ్రూప్ దశలో భారత్‌ను ఒక వికెట్ తేడాతో పాక్ ఓడించింది. ఫైనల్ లో పాక్ ను ఓడించి శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది.
ఆసియా కప్ 2016 (T20 ఫార్మాట్):
పాకిస్తాన్ లోని మీర్పూర్‌లో జరిగింది. ఈసియా కప్ లో ఫస్ట్ టీ-20 ఫార్మాట్ ఇది. పాకిస్తాన్‌ను కేవలం 83 పరుగులకే ఆలౌట్ చేసి, ఐదు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. ఇక్కడ పాక్ గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో ఇండియా తలపడింది.
ఆసియా కప్ 2018
గ్రూప్, సూపర్ ఫోర్ దశల్లో ఇండియా, పాక్ జట్లు రెండుసార్లు తలపడ్డాయి. రెండు సందర్భాలలో కూడా ఇండియా అద్భుతమైన పర్ఫామెన్స్ తో గెలిచింది. పాక్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఫైనల్ లో బంగ్లాను ఓడించి ఇండియా ట్రోఫీని అందుకుంది.
ఆసియా కప్ 2022 (T20I ఫార్మాట్)
ఈ సీజన్ లో ఇండియా పాక్ గ్రూప్, సూపర్ ఫోర్ దశల్లో రెండు సార్లు ఢీకొనగా ఒక్కొక్కటి ఒకసారి గెలిచాయి. అయితే, సూపర్ ఫోర్‌లో పాక్ శ్రీలంక చేతిలో ఓడటంతో ఇండియా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఫైనల్‌లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. శ్రీలంక ఛాంపియన్‌గా నిలిచింది.
ఆసియా కప్ 2023
సూపర్ ఫోర్ దశలో పాకిస్థాన్‌ను 228 పరుగుల తేడాతో ఓడించింది ఇండియా. అయితే సూపర్ ఫోర్‌లో పేలవ ప్రదర్శనతో పాక్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఫైనల్ లో శ్రీలంకను ఓడించి ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆసియా కప్ 2025 (T20 ఫార్మాట్)
ఆసియా కప్ లో టీ20 ఫార్మాట్ ఇది మూడోసారి. మొత్తం 17 ఎడిషన్ల తర్వాత.. ఇండియా , పాక్ ఆసియా కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నాయి. వరుసగా ఆరు గెలుపులతో ఇండియా టాప్ ప్లేస్ సాధించగా.. సీజన్ లో రెండు మ్యాచ్ లు ఓడిన పాక్.. సూపర్ ఫోర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మొత్తానికి ఫైనల్ లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగబోతోంది. 41 ఏళ్ల తర్వాత దాయాది జట్లు ఫైనల్ లో తలపడనుండటంతో.. మ్యాచ్ పై అంచనాలు భారీగా పెరిగాయి.