ఇషాన్ కిషన్, పాండ్యా హాఫ్ సెంచరీలు.. కోలుకున్న టీమిండియా

ఇషాన్ కిషన్, పాండ్యా హాఫ్ సెంచరీలు.. కోలుకున్న టీమిండియా

66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాని ఇషాన్ కిషన్(73), హార్దిక్ పాండ్యా(50) జోడి ఆదుకున్నారు. మొదట నుంచి ఆచి తూచి ఆడుతున్న వీరిద్దరూ పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ  స్కోర్ బోర్డును ముందుకు కదిలిస్తున్నారు. 54 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో ఇషాన్ కిషన్ తన 7వ హాఫ్ సెంచరీ పూర్తి చేరుకోగా.. వైస్ కెప్టెన్ పాండ్యా 62 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు.  

కాగా, అంతకుముందు పాకిస్తాన్ పేసర్ల ధాటికి భారత టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. షాహీన్‌ అఫ్రిది వేసిన 5వ‌ ఓవర్‌లో చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ (11) క్లీన్‌బౌల్డ్ కాగా.. అతని ఏడో ఓవర్‌ మూడో బంతికి విరాట్ కోహ్లీ(4) ఔట‌య్యాడు. ఆపై కాసేపటికే ఆదుకుంటారనుకున్న శ్రేయాస్ అయ్యర్(14) శుభ్ మాన్ గిల్ (10) కూడా ఔట్ అవ్వడంతో.. భారత్ 14.1 ఓవర్లలోనే 4 కీలక వికెట్లు కోల్పోయింది.

34 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ (72), హార్దిక్ (50) పరుగులతో క్రీజులో ఉన్నారు.