IND vs SA: ఇంకో రెండు మాత్రమే.. ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

IND vs SA: ఇంకో రెండు  మాత్రమే.. ధోనీ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

సెంచూరియన్ వేదికగా రేపటి(డిసెంబర్ 26) నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఓ మైలురాయిని చేరుకోనున్నారు. మాజీ దిగ్గజం మహేంద్ర సింగ్ రికార్డు పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టనున్నారు. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

వీరేంద్రుడిది అగ్రస్థానం

టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాళ్లలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(178 ఇన్నింగ్స్‌లలో 90 సిక్సర్లు) అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని రెండో (144 ఇన్నింగ్స్‌లలో 78 సిక్సర్లు) స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ(88 ఇన్నింగ్స్‌లలో 77 సిక్సర్లు) మూడో స్థానంలో ఉన్నారు. 

తొలి టెస్టులో హిట్ మ్యాన్ ఒక  సిక్సర్ కొడితే ధోని సరసన చేరతారు. అదే రెండు సిక్సర్లు బాదితే ధోని రికార్డును అధిగమిస్తారు. ఈ మ్యాచ్ ద్వారా ఆ రికార్డును అధిగమించాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు. మరి హిట్ మ్యాన్ ఆ మైలురాయిని అధిగమిస్తాడా! అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

ఇండియా vs దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్

  • తొలి టెస్ట్(డిసెంబర్ 26 - డిసెంబర్ 30): సెంచూరియన్
  • రెండో టెస్ట్(జనవరి 03 - జనవరి 07): కేప్ టౌన్