IND vs SA 2nd Test: భారత బౌలర్ల విజృంభణ.. సఫారీ బ్యాటర్లకు చెమటలు

IND vs SA 2nd Test: భారత బౌలర్ల విజృంభణ.. సఫారీ బ్యాటర్లకు చెమటలు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. పేస్ ద్వయం జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌ దెబ్బకు దక్షిణాఫ్రికా తొలి 10 ఓవర్లలోపే 4 కీలక వికెట్లు కోల్పోయింది. తొలి స్పెల్‌‌లో సిరాజ్ కట్టుదిట్టమైన బంతులతో ఓపెనర్లు ఐడెన్ మార్‌క్రమ్ (2), డీన్‌ ఎల్గర్‌(4) ఇద్దరిని ఔట్ చేయగా.. స్టబ్స్‌ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఆపై కాసేపటికే సిరాజ్.. టోనీ డిజోర్జి (2) క్యాచ్ ఔట్‌గా వెనక్కి పంపడతో సఫారీ జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. 

తొలి 4 వికెట్లలో సిరాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్ 11 ఓవర్లు ముగిసేసరికి.. 23/4. డేవిడ్ బెడింగ్‌హామ్(8 నాటౌట్),  కైల్ వెర్రేన్నే(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.