IND vs SA 2nd Test: సిరాజ్ 6 వికెట్లు.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాపార్డర్

IND vs SA 2nd Test: సిరాజ్ 6 వికెట్లు.. కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాపార్డర్

9 ఓవర్లు.. అందులో 3 మెయిడిన్స్.. కేవలం 15 పరుగులు.. ఏకంగా 6 వికెట్లు.. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రదర్శన ఇది. పేసీ పిచ్ లపై నిప్పులు చెరిగే బంతులేస్తూ సఫారీ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సిరాజ్. అతన్ని ఎదుర్కోవటానికి.. వికెట్లు పడకుండా కాపాడుకోవటానికి సౌతాఫ్రికా బ్యాటర్లు నానా తంటాలు పడుతున్నారు.

తొలి స్పెల్‌‌లో మార్‌క్రమ్ (2), డీన్‌ ఎల్గర్‌(4), టోనీ డిజోర్జి (2)లను ఔట్ చేసిన సిరాజ్.. రెండో స్పెల్‌‌లో డేవిడ్ బెడింగ్‌హామ్(12), కైల్ వెర్రేన్నే(15), మార్కో జాన్సెన్(0) పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్ 19 ఓవర్లు ముగిసేసరికి.. 46/7. కేశవ్ మహారాజ్(3 నాటౌట్),  కగిసో రబడ(0 నాటౌట్) క్రీజులో ఉన్నారు.