లంకేయులకు దబిడిదిబిడే: దిగ్గజాల సరసన చేరిన రోహిత్ శర్మ

లంకేయులకు దబిడిదిబిడే: దిగ్గజాల సరసన చేరిన రోహిత్ శర్మ

మిత్ర దేశం శ్రీలంక‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జోరు కనబరుస్తున్నారు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ సొంతగడ్డపై లకేయులను ఊచకోత కోస్తున్నారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. ముఖ్యంగా భారత  కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 తరహాలో బ్యాటింగ్ ఆడుతూ లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

10వేల క్లబ్‌లో రోహిత్

ఈ మ్యాచ్‌లో రోహిత్ 22 పరుగుల వద్ద 10,000 క్లబ్‌లో చేరాడు. ఫలితంగా వన్డే క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన ఆరో భారతీయుడిగా, ప్రపంచ క్రికెట్‌లో15వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే, విరాట్ కోహ్లి తర్వాత 10వేల క్లబ్‌లో చేరిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్ కూడా హిట్‌మ్యానే. కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, రోహిత్ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు

  • విరాట్ కోహ్లీ: 205 ఇన్నింగ్స్‌లు.
  • రోహిత్ శర్మ:  241 ఇన్నింగ్స్‌లు.
  • సచిన్ టెండూల్కర్: 259 ఇన్నింగ్స్‌లు.
  • సౌరవ్ గంగూలీ: 263 - ఇన్నింగ్స్‌లు.
  • రికీ పాంటింగ్: 266 - ఇన్నింగ్స్‌లు.

వన్డేల్లో 10వేల పరుగులు చేసిన భారత ఆటగాళ్లు

  • సచిన్ టెండూల్కర్: 18426
  • విరాట్ కోహ్లీ: 13024 
  • సౌరవ్ గంగూలీ: 11363 
  • రాహుల్ ద్రవిడ్: 10889
  • ఎంఎస్ ధోని: 10773
  • రోహిత్ శర్మ*: 10001