Ind vs WI రెండో టెస్టు: హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్.. భారీ స్కోర్ దిశగా ఇండియా

Ind vs WI రెండో టెస్టు: హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్.. భారీ స్కోర్ దిశగా ఇండియా

వెస్టిండీస్ తో రెండో టెస్టులో ఇండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ఆరంభంలో జైస్వాల్ (175 రన్స్) ఔటయిన తర్వాత.. కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.

జైస్వాల్ రనౌట్ తర్వాత నితీశ్ సహకారంతో గిల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 92 బంతులలో ఫిఫ్టీ పూర్తి చేసిన గిల్.. ప్రస్తుతం 71 రన్స్ (120 బాల్స్, 11 ఫోర్లు, 1 సిక్సు) తో సెంచరీ వైపుగా దూసుకెళ్తున్నాడు. క్లాస్ షాట్లతో వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ బౌలర్లను పరుగులు పెట్టిస్తున్నాడు. 

హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న నితీశ్:

మరోవైపు  జైస్వాల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి.. అగ్రెస్సివ్ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 54 బాల్స్ లో 43 రన్స్ తో  ఫోర్లు, సిక్సులతో చెలరేగి వండేను తలపించేలా ఆకట్టుకున్నాడు. వారికన్ బౌలింగ్ లో జైడెన్ సీల్స్ కు క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 

ప్రస్తుతం క్రీజులో గిల్, ధృవ్ జురెల్ ఉన్నారు. ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 400 లు దాటడంతో వెస్టిండీస్ కు భారీ టార్గెట్ ఇవ్వడం పక్కాగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియా స్కోరు110 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 418 దగ్గర ఉంది.