వెస్టిండీస్ తో రెండో టెస్టులో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. రెండో రోజు (అక్టోబర్ 11) ఆట ఆరంభంలోనే యశస్వీ జైస్వాల్ అవుటయ్యాడు. 175 వ్యక్తిగ స్కోర్ దగ్గర రనౌట్ తో వెనుదిరిగాడు యశస్వీ. గిల్, యశస్వీ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ తో ఇండియా వికెట్ కోల్పోయింది.
రెండో రోజు ఆట ఆరంభంలో 91.2 ఓవర్ లో జైడెన్ సీల్స్ వేసిన బాల్ ను మిడ్ ఆఫ్ సైడ్ డ్రైవ్ గా మలిచాడు జైస్వాల్. క్విక్ సింగిల్ కోసం కాల్ ఇచ్చి వేగంగా ముందుకు వెళ్లాడు. ఫీల్డర్ చేతిలో బాల్ ఉండటం చూసి రెండు అడుగులు వేసిన గిల్.. మళ్లీ వెనక్కి వెళ్లాడు. దీంతో మిడ్ ఫీల్డర్ చందర్ పాల్ రనౌట్ చేయడంతో జైస్వాల్ వెనుదిరిగాడు.
శుక్రవారం (అక్టోబర్ 10) ఆటలో 173 రన్స్ చేసిన జైస్వాల్.. రెండో రోజు ఆరంభంలోనే కేవలం రెండు రన్స్ మాత్రమే సాధించి 175 ( 258 బాల్స్ లో 22 ఫోర్లతో 175 రన్స్) దగ్గర ఔటయ్యాడు.
మంచి ఊపుమీదున్న జైస్వాల్.. కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేస్తాడని అందరూ భావించారు. 300 పైనే స్కోర్ చేస్తాడని సీనియర్స్ అంచనా వేశారు. కానీ 175 దగ్గర ఔటవ్వడంతో డబులు సెంచరీ మిస్ చేసుకున్నాడు.
మరోవైపు కెప్టెన్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెచరీ (50) పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఔట్ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్.
ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో తొలిరోజు శుక్రవారం (అక్టోబర్ 10) జైస్వాల్‌కు తోడు మరో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (165 బాల్స్‌లో 12 ఫోర్లతో 87) సత్తా చాటడంతో తొలి రోజే ఇండియా 318/2 భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. రెండో రోజు జైస్వాల్ రికార్డులకు అవకాశం ఉందనుకున్న తరుణంలో అనవస రనౌట్ ట్రై చేసి అవుటయ్యాడు.

— Pat (@starlord_208) October 11, 2025