ఢిల్లీ మెట్రోలో అసభ్యంగా యువతుల హోలీ

ఢిల్లీ మెట్రోలో అసభ్యంగా యువతుల హోలీ

 

  •     మండిపడుతున్న నెటిజన్స్
     

న్యూఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడుతూ రీల్స్ చేశారు. తెల్లటి దుస్తులు ధరించి, నడుస్తున్న మెట్రో ట్రైన్ లో కింద కూర్చొని ఒకరి ముఖానికి ఒకరు రంగులు పూసుకున్నారు. ఆపై అందరూ చూస్తుండగా ఓ రొమాంటిక్ పాటను పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ హగ్గులు, ముద్దులతో హల్ చల్ చేశారు.

ఇద్దరూ అంత రచ్చ చేస్తున్న రైలులో ఉన్న ప్యాసింజర్లు వారిని ఏమీ అనకపోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వీడియోలో ఒక యువతి తెల్లటి చీర కట్టుకుని ఉండగా.. ఇంకో యువతి సూట్ వేసుకుని ఉంది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.