జాతీయ జెండా ఎలా ఎగురవేయాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!

జాతీయ జెండా ఎలా ఎగురవేయాలి.. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!

ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ రోజును.. బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్ర్యం పొందినందుకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ విషయం పక్కన పెడితే ఈ సంవత్సరం మీ ఇంటి ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారం గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.

జాతీయ జెండాను ఎలా ఎగురవేయాలి?

  •  ఫ్లాగ్ కోడ్ 2002 ప్రకారం త్రివర్ణ పతాకం 3:2 నిష్పత్తిలో ఉండాలి. పై ప్యానెల్ రంగు కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ రంగులుండాలి.
  • త్రివర్ణ పతాకం మధ్యలో నేవీ బ్లూ కలర్‌లో 24 సమానమైన గీతలతో అశోక చక్రం ఉండాలి. మీరు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నట్టయితే.. అది వంగి ఉండకుండా, నేల లేదా నీటిని తాకకుండా చూసుకోండి.
  • త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం భారతదేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అయినప్పటికీ, రాజ్యాంగ పదవులు ఉన్నవారు మాత్రమే దాన్ని ఎగురవేస్తారు. ఈ సందర్భంగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం జెండాపై ఏమీ రాసి ఉండకూడదు. మనం వాడే దిండు, రుమాలు లేదా కర్చీఫ్‌పైనా త్రివర్ణ పతాకం ఉండకూడదు.
  • వాహనం, పడవ, రైలు లేదా విమానం హుడ్, పైభాగం, పక్కన లేదా వెనుక భాగాన్ని కప్పడానికి లేదా కవర్ చేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఉపయోగించరు.
  • త్రివర్ణ పతాకం పాడైపోయినట్లయితే, దాని గౌరవాన్ని కాపాడే విధంగా బాధ్యతాయుతంగా పారవేయడం విధి అని గుర్తుంచుకోండి.
  • అవగాహన లేని వారికి, జాతీయ జెండాను అవమానించడం అనేది జాతీయ అహంకారానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 2 ప్రకారం అది శిక్షార్హమైన నేరం. నేరం రుజువైతే వ్యక్తికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించబడుతుంది.