ఇండిపెండెన్స్ డే సేల్... రూ.1,500కే ఫ్లైట్ టికెట్.. విస్తారా స్పెషల్ సర్వీస్.. 

ఇండిపెండెన్స్ డే సేల్... రూ.1,500కే ఫ్లైట్ టికెట్.. విస్తారా స్పెషల్ సర్వీస్.. 

భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవ సందర్బంగా ఫ్లైట్ టికెట్స్ పై భారీ ఆఫర్లు  ప్రకటించింది ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ విస్తారా. డెమెస్టిక్, ఇంటెర్నేషనల్ ఫ్లైట్లలోని ఎకానమీ నుండి బిజినెస్ క్లాస్ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ నేపథ్యంలో బాగ్డోగ్ర టు దిబ్రుగర్ వెళ్లే ప్యాసెంజర్స్ కి ఎకానమీ టికెట్ రూ.1,578కి, ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్లే ప్యాసెంజర్స్ కి ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ రూ. 2,678కి, బిజినెస్ క్లాస్ రూ.9,978కి పొందొచ్చు.

ఢిల్లీ నుండి ఖాట్మండుకు వెళ్లే విమానాల కోసం ఎకానమీ క్లాస్ కోసం ఇంటర్నేషనల్ రిటర్న్స్ వంటి అన్ని చార్జీలతో కలిపి ఛార్జీలు రూ. 11,978 నుండి ప్రారంభమవుతాయి . ప్రీమియం ఎకానమీ క్లాస్ లో ఢిల్లీ నుండి ఖాట్మండుకు రూ. 13,978 నుండి మొదలవుతాయి. అదే రూట్లో బిజినెస్ క్లాస్ కి రూ. 46,978 నుండి టికెట్ ధరలు ప్రారంభమవుతాయి .