రాజ్‌కోట్: యంగ్ స్పిన్నర్ నిషాంత్ సింధు (4/16), ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (68 నాటౌట్) సత్తా చాటడంతో ఆదివారం సౌతాఫ్రికా–ఎతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా–ఎ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది.
తొలుత సౌతాఫ్రికా–ఎ 30.3 ఓవర్లలో 132 రన్స్‌కే కుప్పకూలింది. రివల్డో మూన్‌సామి (33) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (3/21), ప్రసిధ్ కృష్ణ (2/21) కూడా రాణించారు. అనంతరం ఛేజింగ్‌లో ఇండియా–ఎ 27.5 ఓవర్లలోనే 135/1 స్కోరు చేసి గెలిచింది. నిషాంత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించించింది.
