హైదరాబాద్, వెలుగు: భారత్ వన్ ఏఐ సంస్థ బెంగళూరులో ప్రపంచంలోనే మొదటి హ్యూమనిటీ సెంట్రిక్ ఏఐ సిటీ నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా సర్జాపురలో ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బి1 ఏఐ సూపర్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 10 వేల మందికి పైగా ఏఐ పరిశోధకులు, స్టార్టప్ నిర్వాహకులు పనిచేయవచ్చు. ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సీ వంటివి పరిశోధన భాగస్వాములుగా ఉన్నాయి.
రోబోటిక్స్, అటానమస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సురక్షితమైన ఏఐ సిస్టమ్స్అభివృద్ధిపై ఇక్కడ దృష్టి పెడతారు. ఆధార్ వంటి డిజిటల్ గుర్తింపు వ్యవస్థలతో ఏఐను అనుసంధానించే ప్రయత్నం జరుగుతుంది. రాబోయే 36 నెలల్లో ఈ ప్రాజెక్టును నగరం అంతటా విస్తరిస్తారు. డేటా బదిలీ కోసం 400 జీబీపీఎస్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. మానవాళికి ఉపయోగపడే టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
