Parliament: లైఫ్​,హెల్త్ ఇన్సూరెన్స్పై 18% జీఎస్టీ అన్యాయం

Parliament: లైఫ్​,హెల్త్ ఇన్సూరెన్స్పై 18% జీఎస్టీ అన్యాయం
  • పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల ధర్నా
  • నిరసన తెలిపిన రాహుల్,  శరద్ పవార్
  • రాష్ట్రం నుంచి పాల్గొన్న గడ్డం వంశీ, మల్లురవి, చామల, అనిల్ కుమార్ యాదవ్ 
  • సామాన్యులపై భారం వేసేలా కేంద్రం నిర్ణయాలు
  • వెంటనే ఉపసంహరించుకోవాలన్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఢిల్లీ: జీవిత బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ పై 18% జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంతో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేశారు. జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఆందోళనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులపై భారం వేసేలా ఉందన్నారు. పేద వారిని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని విమర్శించారు. అంబానీ, అదానీలకు మేలు చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులపై విధించిన 18% జీఎస్టీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.