ఇయ్యాల మణిపూర్​కు.. ‘ఇండియా’ ఎంపీల టీమ్

ఇయ్యాల మణిపూర్​కు.. ‘ఇండియా’ ఎంపీల టీమ్

న్యూఢిల్లీ: మణిపూర్​ను సందర్శించి అక్కడి పరిస్థితులపై ప్రభుత్వానికి, పార్లమెంట్​కు రిపోర్ట్ ఇస్తామని ‘ఇండియా’ కూటమిలోని 20 మంది ఎంపీలు, ప్రతినిధులతో కూడిన బృందం శుక్రవారం ప్రకటించింది. శాంతి స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచిస్తామని వివరించింది. మణిపూర్​లోని లోయ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో శనివారం, ఆదివారం ఈ బృందం పర్యటించనుంది. ఈ క్రమంలో బృందంలో సభ్యుడైన లోక్​సభ కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ పార్లమెంట్ బయట మాట్లాడారు. 

‘‘మణిపూర్​లో అంతా బాగానే ఉందంటూ బీజేపీ చెబుతోంది. మరి అక్కడ అల్లర్లు ఎందుకు ఆగడం లేదు? శాంతి స్థాపనలో  రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమైంది? ప్రజల చేతుల్లోకి ఆయుధాలు ఎలా వచ్చాయి? ప్రభుత్వం ఏం చేస్తోంది? అందుకే సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని గొగోయ్ చెప్పారు.