Ind vs Nz : ఒక్క సిక్సు కూడా కొట్టలే

Ind vs Nz : ఒక్క సిక్సు కూడా కొట్టలే

లక్నో వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  100 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లను కోల్పోయి మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. అయితే రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక్కటంటే ఒక్క సిక్స్ పడలేదు. సాధారణంగా టీ 20 మ్యాచ్ అంటేనే  సిక్సులు ఫటాఫట్ గా పడుతుంటాయి. కానీ ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఒక్క సిక్స్ కూడా బాదలేదు. ఇండియాలో జరిగిన టీ20 మ్యాచుల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇక  మ్యాచ్ లో మొత్తం 14 ఫోర్లు నమోదయ్యాయి. కివీస్ 6 ఫోర్లు బాదగా, టీమిండియా 8 ఫోర్లు కొట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేసిన టీమిండియా అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న జరగనున్న చివరి టీ 20 మ్యాచ్ లో కివీస్ తో తలపడనుంది.