టాయ్స్ హబ్ గా భారత్

టాయ్స్ హబ్ గా భారత్

ఎదిగే సత్తా ఉందంటున్న ఇండస్ట్రీ.. ప్రభుత్వం ఎంకరేజ్‌ చేయాలని రిక్వెస్ట్

న్యూఢిల్లీ: చిన్నారులకు తిండి ఎంత ముఖ్యమో బొమ్మలూ అంతే ఇంపార్టెంట్‌‌. అవి వారికి బెస్ట్‌ ఫ్రెండ్స్‌‌ కూడా. బొమ్మలు బాలల జీవితంలో భాగమైపోతాయి. అందుకే.. తక్కువ ఆదాయం ఉండే కుటుంబాలు కూడా బొమ్మలు కొనకుండా ఉండలేని పరిస్థితి. మనదేశంలో చాలా రాష్ట్రాల్లో బొమ్మలు తయారవుతున్నా, దిగుమతుల వాటాయే ఎక్కువ. ఈ పరిస్థితిని మార్చాలని, మనదేశం టాయ్స్‌‌హబ్‌‌గా ఎదిగేలా స్టార్టప్‌‌లు, కంపెనీలు పనిచేయాలని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చారు. మోడీ అన్నట్టు టాయ్స్‌‌ హబ్‌‌గా ఎదిగే సత్తా ఇండియాకు ఉందని ఇండస్ట్రీవర్గాలు చెబుతున్నాయి. ఈ సెక్టార్‌‌లోని కొన్ని సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వ కల సాకారమవుతుందని చెబుతున్నాయి. మరింత నాణ్యమైన బొమ్మలను తయారు చేయించడానికి మోడీ ప్రభుత్వం వీటికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సర్టిఫికేషన్‌‌ను తప్పనిసరి చేసింది. సెప్టెంబరు నుంచి ప్రతి బొమ్మల కంపెనీలో బీఐఎస్‌ సర్టిఫికేషన్‌‌ కోసం టాయ్‌‌ టెస్టింగ్‌‌ ల్యాబ్స్‌‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.దీంతో కంపెనీలకు సమస్యలు ఎదురయ్యాయి. కరోనా లాక్‌‌డౌన్‌‌ వల్ల పడిపోయిన అమ్మకాలతో ఇబ్బందిపడుతున్న టాయ్స్‌‌ ఫ్యాక్టరీలకు కొత్తగా ల్యాబ్స్‌‌ ఏర్పాటు చేయడం సవాల్‌‌గా మారింది. టెస్టింగ్‌‌ పరికరాలకు ఆర్డర్‌‌ ఇచ్చినా విదేశాల నుంచి రాక ఇబ్బందిపడ్డాయి. అంతేగాక కొన్ని కంపెనీల్లో తయారీ కూడా నిలిచిపోయింది. దీంతో బీఐఎస్‌ సర్టిఫికేషన్‌‌ నుంచి కొంతకాలం మినహాయింపు ఇవ్వాలని ఆలిండియా టాయ్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌ అసోసియేషన్‌‌ (ఏఐటీఎంఏ) రిక్వెస్ట్‌ చేసింది. దీనిపై సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ సానుకూలంగా స్పందించింది. ల్యాబ్స్‌‌ ఏర్పాటుకు 2021 జనవరి దాకా గడువు ఇచ్చింది.

విదేశాల బొమ్మల్లో కొరవడిన క్వాలిటీ

స్టాండర్డ్స్‌ ప్రకారం లేని బొమ్మల దిగుమతులకూ, అమ్మకాలకూ అనుమతి ఇవ్వబోమని సెంట్రల్‌‌ కన్జూ మర్‌‌ అఫైర్స్‌‌ మిని స్టర్‌‌ రామ్‌‌విలాస్‌ పాశ్వాన్‌‌ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వస్తున్న వాటిలో మూడింట రెండువంతుల బొమ్మలు సేఫ్టీ స్టాండర్డ్స్‌ ప్రకారం లేవని క్వాలిటీ కౌన్సిల్‌‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ) ప్రకటించి న నేపథ్యం లో మిని స్టర్‌‌ ఈ కామెంట్స్‌‌ చేశారు. చైనా నుంచి వస్తున్న నాసిరకం బొమ్మల దిగుమతులను అడ్డుకోవడం, లోకల్‌‌గానే క్వాలిటీ టాయ్స్‌‌ తయారయ్యేలా చేయడాన్ని మోడీ గవర్నమెంటు టార్గెట్‌‌గా పెట్టుకుంది. బొమ్మల దిగుమతులపై సుంకాన్ని పెంచింది. అయితే బీఐఎస్‌ సర్టిఫికేషన్‌‌ వల్ల చాలా సమస్యలు వస్తాయని స్పోర్ట్స్ గూడ్స్‌‌ ఎక్స్‌‌పోర్ట్‌ ప్రమోషన్‌‌ కౌన్సిల్‌‌ (ఎజీఈపీసీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌‌ తరుణ్‌ దేవన్‌‌ అన్నారు. చిన్న గ్రామాలు, పట్టణాల్లోని చేతివృత్తుల కళాకారులు చేసే బొమ్మలకు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌‌ చేయించడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు ఇలాంటి వారికి సర్టిఫికేషన్‌‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

ఇబ్బందులూ ఉన్నాయి..

మనదేశంలో టాయ్స్‌‌ తయారీపై పన్నులు ఎక్కువగానే ఉన్నా యి. లేబర్‌‌ చట్టాల వల్ల కంపెనీలకు ఇబ్బం దులు ఉన్నా యనే వాదనలూ వినిపిస్తున్నాయి. తగినంత టెక్నాలజీ, ఆర్ అండ్‌ డీ, టాయ్స్‌‌ డిజైనింగ్‌‌ ఇన్‌‌స్టి ట్యూట్ లు కూడా అందుబాటులో లేవు. గవర్నమెంటు నుంచి కూడా పెద్ద ఇన్సెంటివ్స్‌‌ లేకపోవడంతో పెద్ద కంపెనీలు ఈ సెక్టార్‌‌లోకి రావడం లేదు. చైనాలో మాత్రం టాయ్స్‌‌ ఫ్యాక్టరీలు పెద్ద ఎత్తున వెలిశాయి. ప్రపంచవ్యాప్తంగావాడుతున్న బొమ్మల్లో చైనా వాటాయే 75 శాతం ఉంటుంది. 1991లో లిబరల్‌‌ ఎకానమీ సిస్టమ్‌‌కు గేట్లు తెరవడంతో చైనా బొమ్మలు ఇండియాను ముం చెత్తుతున్నాయి. దీం తో చాలా ఇండియా కంపెనీల షటర్లు మూతపడ్డాయి. అయితే చైనా తయారీ బొమ్మల్లో హాని కరమైన కెమికల్స్‌‌ ఉంటున్నాయనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇండియా టాయ్స్‌‌ మార్కెట్‌‌ విలువ రూ.ఏడు వేల కోట్ల వరకు ఉంటుంది. ఇందులో దిగుమతి అయిన టాయ్స్‌‌ వాటానే 85 శాతం ఉంటుంది.

ఇండియాలోనూ చాలా బొమ్మలు

మన దేశంలో కర్ర, పాలిమర్‌‌, క్లాత్‌ , ఫైబర్‌‌, కర్రగుజ్జు, రబ్బర్‌‌, మెటల్‌‌ను బొమ్మల తయారీకి వాడుతున్నా రు. కర్ణాటకలోని చెన్నపట్న, యూపీలోని చిత్రకూట్‌‌, ఏపీలోని కొండపల్లిలో సంప్రదాయ బొమ్మల తయారీ యూనిట్లు ఉన్నాయి. 1980 వరకు మనదేశంలో బొమ్మల దిగుమతులకు అనుమతి ఉండేది కాదు. ఇప్పుడు మనదేశంలో వినియోగమవుతున్న వాటిలో 90 శాతం బొమ్మలు విదేశాల్లో తయారవుతున్నవే. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే మెకనైజ్డ్‌‌ టాయ్స్‌‌ చైనా నుంచి వస్తున్నాయి. ఈ దేశానికి టాయ్స్‌‌ క్యాపిటల్‌‌గానూ పేరుంది. మనదేశంలోనూ కర్ణాటక, రాజస్థాన్‌‌ రాష్ట్రాల్లో టాయ్స్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ హబ్స్‌‌ ఏర్పాటవుతున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.

టాయ్స్ ఇండస్ట్రీ ఏం అడుగుతోందంటే…

టాయ్స్‌ తయారీపై పన్నులు తగ్గాలి. లేబర్‌ చట్టాల్లో మార్పులు చేయాలి. తగినంత టెక్నాలజీ, ఆర్ అండ్‌ డీ సెంటర్లను, టాయ్స్‌ డిజైనింగ్‌ ఇన్‌‌స్టిట్యూట్లను అందుబాటులోకి తేవాలి.

క్లస్టర్లకు రాబోయే టెక్నాలజీ డెవలప్‌ మెంట్‌ సెంటర్లకు సపోర్ట్‌‌ అందజేయాలి. బొమ్మల విడిభాగాలపై దిగుమతుల సుంకాలను తగ్గించాలి.

ప్లగ్‌ అండ్‌ ప్లే ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ ను కంపెనీలకు అందుబాటులోకి తేవాలి.

సింగిల్‌ విండో విధానంలో కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వాలి.

ఇండియా టాయ్స్‌ మార్కెట్‌ విలువ రూ.7000 కోట్లు

ఇండియాకు వస్తున్న బొమ్మల్లో చైనా బొమ్మల వాటా 90%

డొమెస్టిక్‌ ప్రొడక్షన్‌‌ వాటా: 10-15%

దిగుమతుల వాటా: 85%