గంభీర్ సన్నిహితుడు అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా.. ఐపీఎల్లో కేకేఆర్‌తో ర్యాన్ టెన్ డీల్!

గంభీర్ సన్నిహితుడు అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా.. ఐపీఎల్లో కేకేఆర్‌తో ర్యాన్ టెన్ డీల్!

India Coach: భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. జట్టు ప్రదర్శనలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాననే భావనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు ఇస్తారని భావించినప్పటికీ, టీ దిలీప్ ఆ స్థానంలో కొనసాగడంతో డస్కాటే కేవలం అసిస్టెంట్ కోచ్‌గానే మిగిలిపోవాల్సి వచ్చింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో భారత్ ఘోర ఓటమి తర్వాత ఇండియా సపోర్ట్ స్టాఫ్ నుంచి వైదొలగాలని ర్యాన్ టెన్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఆయన మళ్లీ ఐపీఎల్ 2027లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కోచింగ్ విభాగంలో చేరనున్నారు.  

కేకేఆర్‌తో సుదీర్ఘ అనుబంధం.. అభిషేక్ నాయర్‌తో మళ్లీ జర్నీ:

కేకేఆర్ ఫ్రాంచైజీతో డస్కాటేకు దాదాపు దశాబ్ద కాలానికి పైగా మంచి అనుబంధం ఉంది. ఆటగాడిగా 2012, 2014లలో ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన కేకేఆర్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతడు, 2022లో ఫీల్డింగ్ కోచ్‌గా తిరిగి వచ్చారు. హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ ఆధ్వర్యంలో కేకేఆర్ 2024 ఐపీఎల్ విజయాన్ని సాధించడంలో కూడా ర్యాన్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లోకి చేరడంతో గతంలో భారత జట్టులోనూ, కేకేఆర్‌లోనూ తనతో కలిసి పని చేసిన అభిషేక్ నాయర్‌తో డస్కాటే మళ్లీ జోడి కట్టనున్నారు.  

►ALSO READ | హార్దిక్ ఔట్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ..?

పరిమిత ఓవర్లలో సక్సెస్, టెస్టుల్లో నిరాశ: 

2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు, డస్కాటే అసిస్టెంట్ కోచ్‌గా ఇండియన్ టీమ్ లో చేరారు. ఆయన రెండేళ్ల కాలంలో భారత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 2025 ఆసియా కప్ సాధించడంతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. కానీ అదే సమయంలో టెస్ట్ క్రికెట్‌లో మాత్రం టీమిండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడంతో పాటు స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాల చేతిలో టెస్ట్ సిరీస్ పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది.