
- జపాన్ ను అధిగమించాం: నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: ఇండియా జీడీపీ జపాన్ను దాటిందని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.. మొత్తం జియోపొలిటికల్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా యని అన్నారు. "ప్రస్తుతం మనం నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇండియా ఎకానమీ 4 ట్రిలియన్ డాలర్లను దాటింది" అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత రిపోర్టర్లతో మాట్లాడుతూ చెప్పారు.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) డేటాను చూస్తే ఈ విషయం అర్ధమవుతోందని తెలిపారు. ఇండియా ఇప్పుడు జపాన్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. "అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే. ఇండియా కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలు. మనం ప్లాన్ చేసినట్టు కొనసాగితే ఇంకో రెండున్నర నుంచి మూడేళ్లలో ఇండియా మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది" అని సుబ్రహ్మణ్యం వివరించారు.
ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ఇండియా జీడీపీ 4.187 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. జపాన్ ఎకానమీ 4,186 ట్రిలియన్ ను డాలర్లను స్వల్పంగా అధిగమించిందని డేటా చూపి స్తోంది. కానీ, జపాన్ జీడీపీ ఫర్ క్యాపిటా 33,960 డాలర్లతో పోలిస్తే ఇండియా జీడీపీ పర్ క్యాపిటా 2,880 డాలర్లు చాలా తక్కువ. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న జర్మనీ జీడీపీ 4.74 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. పర్ క్యాపిటా జీడీపీ 55,910 డాలర్లు. యూఎస్, చైనా టాప్ రెండు పొజిషన్లలో ఉన్నాయి.