పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీల ధర్నా

 పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీల ధర్నా
  • పార్లమెంట్ ముందు కూటమి ఎంపీల ధర్నా
  • బిహార్​లో చేపడ్తున్న ‘సర్’ను ఖండించిన సభ్యులు

న్యూఢిల్లీ, వెలుగు: బిహార్​లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్​లో ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. మకర్ ​ద్వార్​కు ఎదుగురుగా చేపట్టిన ఈ ఆందోళనలో.. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్ యాదవ్, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్, సాగరికా ఘోష్, డీఎంకే ఎంపీ కనిమెళి, ఎ.రాజా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సర్–ప్రజాస్వామ్యంపై దాడి’అనే భారీ బ్యానర్, ‘స్టాప్ ఎస్ఐఆర్’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు.

ప్రియాంకతో కలిసి తెలంగాణ ఎంపీల ధర్నా

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో ‘సర్’పై ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో తెలంగాణ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, చామల, ఇతర ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం లేకుండా, ఎన్నికల తర్వాత ఓటర్లను మత, కుల ప్రాతిపదికన వడపోసే ఈ ప్రయత్నం.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్రగా ప్రియాంక గాంధీ విమర్శించారు. ఓటర్లను తొలగించడం కాదు.. వారి గొంతుకను వినడమే ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర ప్రభుత్వానికి హిత వు పలికారు. బిహార్ ఎన్నికలకు ముందు కుట్రపూరితంగా సర్​ను
తీసుకొచ్చారని ఎంపీ గడ్డం వంశీ విమర్శించారు.