
- 9 న్యూ–ఏజ్ కంపెనీల్లో వాటాలు
- కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు, ఇన్ఫోసిస్, విప్రోలలోనూ షేర్ల ధరపైనా ఎఫెక్ట్
ముంబై : కెనడా, ఇండియాల మధ్య టెన్షన్స్ ప్రభావం వాణిజ్యపరమైన డిస్కషన్స్‌పై కూడా పడుతోంది. మన దేశంలో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (సీపీపీఐబీ) రూ.16,600 కోట్ల (2 బిలియన్ డాలర్ల) పెట్టుబడులు పెట్టింది. యాకో, జొమాటో వంటి కొత్తతరపు కంపెనీలతోపాటు, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కార్పొరేట్లలోనూ ఆ సంస్థ ఇన్వెస్ట్ చేసింది.
యాకోలో రూ. 292 కోట్లు (3.6 శాతం వాటా), బైజూస్‌లో రూ. 1,456 కోట్లు (3.4 శాతం వాటా), డెల్హివరీలో రూ. 879 కోట్లు (6.1 శాతం వాటా), డైలీహంట్‌లో 207 కోట్లు (6.2 శాతం వాటా), ఎరూడిటస్లో రూ. 7,633 కోట్లు (4.3 శాతం వాటా), ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 6663.50 కోట్లు (2.2 శాతం వాటా) పెట్టుబడులుగా కెనడా పెన్షన్ ఫండ్ పెట్టింది. జొమాటోలో 2.37 శాతం వాటా, నైకాలో 1.47 శాతం వాటా, పేటీఎంలో 1.76 శాతం వాటాలను ఈ సంస్థ తీసుకుంది. ఇవి కాకుండా, కోటక్‌మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో వంటి పాతతరపు లిస్టెడ్ కంపెనీలలో సైతం కెనడా పెన్షన్ ఫండ్ఇన్వెస్ట్ చేసింది. ఈ ఫండ్ పెట్టుబడులున్న కంపెనీల షేర్లు గత కొన్ని రోజులలో పడ్డాయి.