భారత్.. ఫాలో ఆన్ లో రికార్డు క్రియేట్ చేసి 22 ఏళ్ల పూర్తి

భారత్.. ఫాలో ఆన్ లో రికార్డు క్రియేట్ చేసి 22 ఏళ్ల పూర్తి

2001లో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచులో భారత్ చారిత్రాత్మక విజయం సాదించి నేటికి 22 ఏళ్లు పూర్తయింది. ఈ మ్యాచులో భారత్  ఆస్ట్రేలియాను ఓడించిన.. ఫాలో-ఆన్ తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఆ గెలుపుతో భారత క్రికెట్ లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.  

వరుసగా 15 టెస్టుల్లో గెలిచి పరంపర కొనసాగిస్తున్న ఆస్ట్రేలియాపై భారత్ పోరాడి గెలిచింది. 171 పరుగుల తేడాతో టీమిండియా ఆసీస్ ను ఓడించి చరిత్ర సృష్టించింది. వీవీఎస్ లక్ష్మన్, రాహుల్ ద్రవిడ్ కలిసి 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో ఫాలోఆన్ ను తప్పించుకోగలిగింది. 

ఈ మ్యాచు గెలుపును క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటూ.. గెలుపు తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ద్రవిడ్ తో పాటు ఇతర ఆటగాళ్లు చేసిన హంగామా వీడియోను ట్వీట్స్ చేస్తున్నారు.