చంద్రుడిపై ఇండియా.. : చంద్రయాన్ 3 సక్సెస్

చంద్రుడిపై ఇండియా.. : చంద్రయాన్ 3 సక్సెస్

ప్రపంచం మొత్తం జయహో జయహో ఇండియా అంటుంది. చంద్రయాన్ 3 చంద్రుడిని ముద్దాడింది. సేఫ్ ల్యాండింగ్ అయ్యింది. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిది ఇస్రో చేసి చూపించింది. చంద్రయాన్ 3 నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ముద్దాడింది. చంద్రుడిపై ఇండియా జెండా ఎగిరింది.

నాలుగు దశల్లో సాగిన ప్రయోగం అణువణువు ఉత్కంఠ రేపింది. రఫ్ బ్రేకింగ్, ఆటిట్యూట్ హోల్డ్, ఫైన్ బ్రేకింగ్, టెర్మినల్ డిసెంట్.. ఇలా ప్రతి దశలోనూ చంద్రయాన్ అద్భుతంగా పని చేసింది. ఆరు గంటల నాలుగు నిమిషాలకు అనుకున్న సమయానికి.. చంద్రుడి దక్షిణ ధృవాన్ని ముద్దాడింది ఇండియా. సేఫ్ ల్యాండ్ అయినట్లు ఇస్రో చైర్మన్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు సంకేతాలు వచ్చినట్లు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి. లైవ్ లో ప్రయోగాన్ని చూసిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇది భారత్ విజయం అన్నారు.