
లండన్: ఇండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్.. ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ఈ మేరకు హాంప్‌షైర్‌తో జరిగే సీజన్ ఎండింగ్ మ్యాచ్ కోసం సర్రే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. వైట్‌బాల్ క్రికెట్‌లో ఇండియా తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడిన 26 ఏళ్ల చహర్.. సెప్టెంబర్ ప్రారంభంలోనే కౌంటీల్లో ఆడాల్సి ఉంది. కానీ ఓవల్‌లో వార్విక్‌షైర్, నాటింగ్‌హామ్ షైర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అతనికి చాన్స్ దక్కలేదు.
ఇండియా స్పిన్నర్ ఆర్. సాయి కిశోర్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో అతని ప్లేస్‌లో చహర్‌ను తీసుకున్నట్లు సర్రే క్రికెట్ డైరెక్టర్ అలెక్ స్టీవార్ట్ వెల్లడించాడు. ఇక వాషింగ్టన్ సుందర్ హాంప్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘ఈ వారం మ్యాచ్ కోసం నేను సర్రే జట్టులో చేరడానికి ఉత్సాహంగా ఉన్నా. విజయం కోసం నా శక్తి మేరకు ప్రయత్నిస్తా’ అని చహర్ పేర్కొన్నాడు.