
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగుల వేడుకల్లో అందరూ మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేస్తూ విషెస్ చెప్పుకున్నారు. హోలీ వేడుకలను టీమిండియా క్రికెటర్లు కూడా ఘనంగా జరుపుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టు కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి బస్సులో వెళ్తు్ండగా క్రికెటర్లు హోలీ ఆడుతూ సందండి చేశారు. దీన్నంతా శుభ్‌మాన్ గిల్ తన ఫోన్ లో రికార్డు చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ టెస్టులో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే చివరి మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఎందుకంటే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే భారత్ జట్టు ఈ అహ్మదాబాద్ టెస్టులో తప్పక విజయం సాధించాల్సి ఉంది. దీంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ మొదటిరోజు ఆటను రు దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోనీ అల్బనీస్ కలిసి వీక్షించనున్నారు.