అక్టోబర్–-డిసెంబర్ నెలలో తగ్గిన సీఏడీ 

అక్టోబర్–-డిసెంబర్ నెలలో  తగ్గిన సీఏడీ 

న్యూఢిల్లీ: మనదేశ కరెంట్ ఖాతా లోటు  (సీఏడీ) అక్టోబర్–-డిసెంబర్ త్రైమాసికంలో 11.4 బిలియన్ డాలర్ల నుండి 10.5 బిలియన్ డాలర్లకు లేదా జీడీపీలో 1.2 శాతానికి తగ్గింది.  ఒక సంవత్సరం క్రితం ఇదే కాలంలో ద్రవ్యలోటు  16.8 బిలియన్ డాలర్లు ఉందని ఆర్​బీఐ మంగళవారం తెలిపింది. గత ఏడాది ఏప్రిల్–-డిసెంబర్​లో ఎఫ్‌‌డీఐ నికర ఇన్‌‌ఫ్లో  8.5 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 ఏప్రిల్–-డిసెంబర్ మధ్య  21.6 బిలియన్ డాలర్ల వరకు ఉంది.

 విదేశీ మారక నిల్వలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో ఆరు బిలియన్ డాలర్లు పెరిగాయి. ఒక సంవత్సరం క్రితం వీటి విలువను 11.1 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. 2022–-23 మూడవ త్రైమాసికంలో సరుకుల వాణిజ్య లోటు 71.3 బిలియన్ డాలర్ల నుంచి 71.6 బిలియన్ డాలర్లకు పెరిగింది.