నేపాల్‌‌కు 81 బస్సులు విరాళంగా పంపిన భారత్

నేపాల్‌‌కు 81 బస్సులు విరాళంగా పంపిన భారత్

ఖాట్మండు: నేపాల్‌‌లోని పలు ఎడ్యుకేషనల్‌‌ ఇనిస్టిట్యూషన్స్‌‌కి భారత ప్రభుత్వం 81 స్కూల్‌‌ బస్సులు డొనెట్‌‌ చేసింది. ఈ విరాళాలు ఇండియా, నేపాల్‌‌ మధ్య దీర్ఘకాలిక అభివృద్ధి, భాగస్వామ్యం, స్నేహంలో భాగమని ఖాట్మండులోని భారత ఎంబసీ తెలిపింది. 

నేపాల్‌‌లోని 48 జిల్లాల్లోని పలు విద్యా సంస్థలకు ఈ 81 బస్సులను విరాళంగా ఇచ్చామంది. ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన కోషి ప్రావిన్స్‌‌లోని ఇలాం, ఝాపా, ఉదయపూర్ జిల్లాలకు కూడా బస్సులను అందజేశామని బుధవారం ఒక ప్రకటనలో తెలింది. 

గత 30 ఏండ్లలో నేపాల్‌‌కు ఇండియా 381 స్కూల్‌‌ బస్సులను విరాళంగా ఇచ్చింది. స్కూల్‌‌ బస్సులు విద్యార్థులకు ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి సేఫ్​గా స్కూళ్లకు రావడానికి ఉపయోగపడతాయని ఇండియన్‌‌ ఎంబసీ పేర్కొంది.