రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల లిస్టులో చేరింది. భారత్ మొట్టమొదటిసారిగా మూడోస్థానం దక్కించుకుంది. ఈ లిస్టులో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉండగా… చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న భారత్ 2019లో రక్షణ రంగం కోసం 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (SIPRI) తెలిసింది.
అమెరికా రక్షణ రంగ వ్యయం 732 బిలియన్ డాలర్లు అని SIPRI తెలిపింది. తర్వాత స్థానంలో ఉన్న చైనా తన సైనిక బలగాల కోసం 261 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. రష్యా 65.1 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 61.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 2019లో ప్రపంచ సైనిక ఖర్చు మొత్తంలో1,917 బిలియన్ డాలర్లని చెప్పింది. 2018తో పోల్చితే 3.6 శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది.
