
ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్టుకు ఇండియా ప్లాన్!
చెన్నై: ఇండియాలో టెస్టు క్రికెట్‌కు సొంత డైనమిక్స్ ఉంటాయి. ఫారిన్ నుంచి రిటర్న్ అయ్యామంటే ఇక్కడ కనిపించే తొలి మార్పు స్పిన్‌పై ఫోకస్. ఆస్ట్రేలియాలో తమ పేసర్లు అదరగొట్టినప్పటికీ.. శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టుల్లో టీమిండియా ఎప్పట్లానే ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములా ప్రయోగించనుంది. చెపాక్‌లో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ అండ్ కో.. పిచ్‌ను పరిశీలించిన తర్వాత ఇది ట్రెడిషనల్ స్పిన్ ట్రాక్ అన్న అంచనాకు వచ్చేసింది. ఈ లెక్కన తొలి రోజు బౌన్స్ లభించి.. రెండు, మూడు రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ వికెట్‌పై చివరి రెండు రోజుల్లో బాల్ బాగా టర్న్ అవనుంది. దాంతో, స్వదేశంలో విన్నింగ్ ఫార్ములా అయిన ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో ఇంగ్లండ్‌ను పడగొట్టాలని ఇండియా డిసైడైనట్టు తెలుస్తోంది. ఆ లెక్కన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, చైనామన్ కుల్దీప్ యాదవ్ ఫస్ట్ చాయిస్ స్పిన్నర్లుగా బరిలో ఉండడం ఖాయమే. మరో ప్లేస్ కోసం యంగ్‌స్టర్స్ వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇద్దరూ బ్యాటింగ్ కూడా చేయగలగడం టీమ్‌కు ప్లస్ పాయింట్ కానుంది. ‘మేనేజ్‌మెంట్ బ్యాటింగ్‌లో మరింత డెప్త్ కావాలని అనుకుంటే సుందర్‌కు చాన్స్ ఇవ్వొచ్చు. అయితే, వారం కిందట శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ లసిత్ ఎంబుల్డెనియా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో అక్షర్ పటేల్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. పైగా, ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉంటే మరింత కంట్రోల్ లభిస్తుంది’ అని టీమ్ వర్గాలు చెప్పాయి.
ఇక, ఆరుగురు బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రిషబ్ పంత్ బరిలోకి దిగడం లాంఛనమే. కాస్త ఆలస్యంగా టీమ్‌తో కలిసి బుధవారం తన ఫస్ట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్‌లో చాన్స్ కష్టమే. ఇద్దరు పేసర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ప్లేస్ ఖాయం కాగా.. సెకండ్ పేసర్ కోసం ఇషాంత్ శర్మతో మహ్మద్ సిరాజ్ పోటీ పడుతున్నాడు. ఆసీస్‌లో సూపర్ పెర్ఫామెన్స్ దృష్ట్యా సిరాజ్‌కే చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్లు ఉన్నాయి. అయితే, ఇషాంత్ ఎక్స్‌పీరియన్స్ టీమ్‌కు ప్లస్ అవుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఒకవేళ ఫిట్‌నెస్ ఇష్యూస్ లేకపోతే లంబూనే బరిలోకి దింపే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే, ఇండియాలో తన తొలి టెస్టు ఆడేందుకు హైదరాబాదీ సిరాజ్ కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
For More News..