తగ్గిన ఎగుమతులు .. పెరిగిన వాణిజ్య లోటు

తగ్గిన ఎగుమతులు .. పెరిగిన వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: గిరాకీ తగ్గడం,  భౌగోళిక రాజకీయ సవాళ్ల కారణంగా ఆగస్టులో మనదేశ సరుకుల ఎగుమతులు 9.3 శాతం తగ్గి 34.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య విభాగం  డేటా వెల్లడించింది. ఈ నెలలో దిగుమతులు 3.3 శాతం పెరిగి 64.4 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 29.65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనాలో భారీ మందగమనం, పెట్రోలియం ధరలు పడిపోవడం, యూరప్‌‌‌‌లో మాంద్యం, రవాణా, లాజిస్టిక్స్ సంబంధిత సవాళ్లు సరుకుల ఎగుమతులపై ప్రభావం చూపాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్–-జూన్)  భారతదేశం నుంచి ఎగుమతులు, ఔట్‌‌‌‌బౌండ్ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 5.8 శాతం వృద్ధితో 109.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం దిగుమతులు భారీగా పెరిగాయని సునీల్​ వివరించారు.