వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటనకు నేడే చివరి తేదీ.. ఆ ముగ్గురిలోనే సస్పెన్స్

వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటనకు నేడే చివరి తేదీ.. ఆ ముగ్గురిలోనే సస్పెన్స్

మరో వారం రోజుల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ వార్ మొదలవబోతుంది. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే చాలా జట్లు భారత గడ్డపై అడుగు పెట్టగా.. దాదాపు అన్ని జట్లు తమ 15 మందితో కూడిన స్క్వాడ్ ప్రకటించాయి. అయితే, అంతకంటే ముందు ముఖ్యమైన ప్రక్రియకు గడువు నేటితో తీరిపోనుంది. ప్రపంచకప్ కోసం బరిలోకి దిగే స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనే ఛాన్స్‌కు ఇవాళ చివరి తేదీ కావడంతో భారత్ జట్టులో ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురైంది. 

ముందుగా ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని సెలక్టర్ అగార్కర్ స్పష్టం చేసినా.. అక్షర్ పటేల్ గాయంతో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మిగిలిన ప్లేయర్లలో ఎలాంటి మార్పు లేకపోయినా ఈ ఒక్క స్థానంపైనే సందిగ్ధత నెలకొంది. అక్షర్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడని సంగతి ఆడలేదు. అక్షర్ స్థానంలో వచ్చిన అశ్విన్ బౌలింగ్ లో సత్తా చాటాడు. దీంతో అనుభవం ఉన్న అశ్విన్ కే వరల్డ్ కప్ లో స్థానం దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు అక్షర్ పటేల్ గాయంపై ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇక వాషింగ్ టన్ సుందర్ అవకాశాలు కొట్టిపారేయలేము. ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన చివరి వన్డేలో బౌలింగ్ వేయడంతో పాటు బ్యాటింగ్ లో ఓపెనర్ గా వచ్చాడు. దీంతో ఒక్క స్థానంపై ముగ్గురు పోటీ పడుతున్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేసి ఏ ఇద్దరికి షాక్ ఇస్తారో చూడాలి. ఇకపోతే మిగిలిన 14 మంది ఫామ్ లో నే ఉండడంతో వీరి స్థానాలకు ఎలాంటి ముప్పు లేదు.