రాణించిన రాహుల్, సూర్య.. జింబాబ్వే టార్గెట్ 187

రాణించిన రాహుల్, సూర్య.. జింబాబ్వే టార్గెట్ 187

టీ20 ప్రపంచకప్ లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల  186 నష్టానికి పరుగులు చేసింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు  ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది.  రోహిత్ శర్మ (15) మరోసారి నిరాశపరిచాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ(26)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. పది ఓవర్లు ముగిసే టైమ్ కు టీమిండియా 79 పరుగులు చేసింది.

ఆ తరువాత త్వరత్వరగానే వికెట్లు కోల్పోయింది. విలియమ్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్ కు ప్రయత్నించి  విరాట్ కోహ్లీ (26) ఔట్ కాగా , అ వెంటనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న రాహుల్ (51) కూడా వెనుదిరిగాడు.  కాసేపటికి  రిషభ్‌ పంత్ (3) కూడా  ఔటయ్యాడు. చివర్లో  సూర్యకుమార్ (61) మెరుగైన ఇన్నింగ్స్ తో రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్ తో  సంబంధం లేకుండానే టీమిండియా సెమీస్‌  కు చేరుకుంది.