22 మెడల్స్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రికార్డు.. సిమ్రాన్, ప్రీతి, నవదీప్‌‌‌‌‌‌‌‌కు రజతాలు

22 మెడల్స్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రికార్డు.. సిమ్రాన్, ప్రీతి, నవదీప్‌‌‌‌‌‌‌‌కు రజతాలు

న్యూఢిల్లీ: సొంతగడ్డపై వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా అథ్లెట్లు రికార్డు పతకాలతో చరిత్ర సృష్టించారు. మొత్తంగా 6 స్వర్ణాలు సహా 22 పతకాలు నెగ్గి ఈ మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో తమ బెస్ట్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో 9 రజతాలు, 7 కాంస్యాలు కూడా ఉన్నాయి. టోర్నమెంట్ చివరి రోజైన ఆదివారం ఇండియాకు మూడు రజతాలు, ఒక కాంస్యం లభించాయి. స్ర్పింటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిమ్రన్ శర్మ విమెన్స్‌‌ 200 మీటర్ల టి12 విభాగంలో 24.46 సెకన్లతో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచి సిల్వర్ నెగ్గింది. మరోవైపు విమెన్స్ 100 మీటర్ల టి35 స్ప్రింట్‌‌‌‌‌‌‌‌లో స్టార్టర్ పిస్టల్ మొరాయించడంతో రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు పోటీ పడాల్సి వచ్చినా ప్రీతి పాల్ పట్టుదల చూపించి రజతం గెలిచింది. తను 14.33 సెకన్లలో రేసును పూర్తి చేసింది. జావెలిన్ త్రోయర్ నవదీప్ సింగ్ ఎఫ్‌‌‌‌‌‌‌‌ 41 విభాగంలో (45.46 మీటర్లు) రజతం అందుకోగా.. మెన్స్ 200 మీటర్ల టి44 విభాగంలో సందీప్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. బ్రెజిల్ 15 గోల్డ్ సహా 44 మెడల్స్‌‌‌‌‌‌‌‌తో అగ్రస్థానంలో నిలవగా.. ఇండియా పదో స్థానం దక్కించుకుంది.