
టొరంటో: ఇండియా గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్.. ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మరో విజయాన్ని సాధించాడు. బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో 87 ఎత్తులతో నిజత్ అబసోవ్ (అజర్‌బైజాన్)పై గెలిచాడు. ఆరు గంటల పాటు సాగిన మారథాన్ గేమ్‌లో ఇండియన్ ప్లేయర్ కింగ్ పాన్ డిఫెన్స్‌తో ఆడాడు. ఈ రౌండ్ తర్వాత గుకేశ్ మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇయాన్ నెపోమ్నియాచి (రష్యా)తో జరిగిన గేమ్‌ను ఆర్. ప్రజ్ఞానంద (2.5) డ్రా చేసుకున్నాడు. విమెన్స్ సెక్షన్‌లో ఆర్. వైశాలి (2.5).. అనా ముజిచుక్ (ఉక్రెయిన్ 2)తో, కోనేరు హంపి (2).. అలెగ్జాండ్రా గోరియాచికినా (రష్యా 3)తో జరిగిన గేమ్‌లను డ్రా చేసుకున్నారు. ఈ టోర్నీలో ఇంకా 9 రౌండ్స్ మిగిలి ఉన్నాయి.