
హైదరాబాద్, వెలుగు: మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ‘మాక్ పార్లమెంట్’లో ఆయన మట్లాడారు. ఈ సందర్భంగా ‘ద ఎమర్జెన్సీ డైరీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు, ఎంపీ డీకే అరుణ, మనోహర్ రెడ్డి, శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.