
వరల్డ్ కప్ 2019 మెగాటోర్నీలో భాగంగా.. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో ఇంగ్లండ్, ఇండియా మధ్య కీలకమైన లీగ్ మ్యాచ్ జరుగుతోంది. 338 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. చేజింగ్ మొదలుపెట్టిన కొద్దిసేపటికే తొలి వికెట్ కోల్పోయింది ఇండియా. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లోనూ ఫెయిలయ్యాడు. క్రీజులో ఇబ్బందిగా కదిలిన కేఎల్ రాహుల్ 9 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్కిప్పర్ విరాట్ కోహ్లీ… ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. టాప్ ఆర్డర్ గట్టి పునాది వేస్తే గానీ భారీ స్కోరు ఛేదించడం కష్టమైన ఈ మ్యాచ్ లో మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలో పరుగులు రావడం బాగా కష్టమైంది. సాధించాల్సిన రన్ రేట్ బాగా పెరిగిపోయింది. 15 ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి 53 పరుగుల దగ్గరే ఉండిపోయింది.
కోహ్లీ గ్యాంగ్ ఖాతాలో చెత్త రికార్డ్
ఈ వరల్డ్ కప్(ఇప్పటివరకు) లో అత్యంత చెత్త రికార్డ్ ఒకటి ఈ మ్యాచ్ లో ఇండియా పేరిట నమోదయ్యింది. వికెట్లు కాపాడుకోవడానికి రోహిత్, కోహ్లీ ప్రాధాన్యత ఇవ్వడంతో రన్స్ రాలేదు. 10 ఓవర్ల పవర్ ప్లే ముగిసే సరికి ఇండియా స్కోరు 29/1 మాత్రమే. ఇది ఈ వరల్డ్ కప్ లోనే పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు. కీలకమైన మ్యాచ్ లో ఒత్తిడిలో ఉన్న ఇండియా… ఈ చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది. పవర్ ప్లేలో హయ్యెస్ట్ బెస్ట్ స్కోర్ రికార్డ్ ప్రస్తుతానికి ఇంగ్లండ్ పేరిట నమోదై ఉంది.