విశ్లేషణ: 2500 నాటికి.. ఇండియా ఇట్లుంటదట!

V6 Velugu Posted on Oct 27, 2021

ఇప్పటి నుంచి ఐందొందల ఏండ్లు వచ్చేసరికి భూమిపై వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి. గ్రీన్‌‌ హౌస్‌‌ ఉద్గారాల వల్ల భూమ్మీద వేడి పెరిగిపోతుంది. దానివల్ల  మనుషులు భూమిపై తిరగాలంటే స్పేస్‌‌ సూట్‌‌లాంటి డ్రెస్‌‌లు వేసుకుని తిరగాల్సిందే. అమెజాన్‌‌ పరీవాహక ప్రాంతాలు బీడువారిపోతాయి. అమెరికా, ఇండియాలలో వేడి ఎక్కువై పోతుంది. కానీ కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ ప్రభావాన్ని తగ్గించ గలిగితే ఈ ఉపద్రవం నుంచి బయటపడే అవకాశం ఉందంటూ ఇంగ్లాండ్‌‌ లీడ్‌‌ యూనివర్సిటీ సైంటిస్టులు వివరిస్తున్నారు. అంతేకాదు దానికి సంబంధించిన ఊహాచిత్రాలను కూడా రివీల్‌‌ చేశారు.

ఇప్పటికి.. అప్పటికి
మూడువేల సంవత్సరం వచ్చే సరికి ప్రపంచంలో పెద్దగా మార్పేమీ ఉండదు కానీ.. మనుషులంతా కొత్త వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీళ్లకింద బతకాల్సి ఉంటుంది అనేది ఓ పాప్‌‌ సాంగ్‌‌లో ఉంది. 3 వేల ఏండ్ల మాట పక్కన పెడితే.. రెండువేల ఐదొందల ఏండ్ల నాటికే ఇండియాలో భూమిపై అసలు ప్రజలు నివసించే అవకాశం తగ్గిపోతుందని రీసెర్చర్స్‌‌ అంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్‌‌‌‌లో గ్రీన్‌‌ హౌస్​ గ్యాస్‌‌ పెరిగిపోవడం వల్ల భూమిపై వేడి ఎక్కువై పోతుంది. దానివల్ల అమెజాన్‌‌ ఫారెస్ట్‌‌లు బంజరులుగా మారతాయి.

అమెరికాలో టెంపరేచర్​ విపరీతంగా పెరిగిపోతుంది. అన్నింటి కంటే మించి ఇండియాలో కూడా వేడి విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు దారుణంగా తయారవుతాయట. వీరు అంచనా వేసిన ప్రకారమే అంతా జరిగితే మాత్రం మనుషులు నీటి కిందే బతకాల్సి వస్తుంది. వారు నేలపైకి వచ్చినప్పుడు ఏలియన్ల మాదిరిగా స్పేస్​ సూట్లులు వేసుకుని తిరిగాల్సిన పరిస్థితులు  ఏర్పడతాయి. సైంటిస్టుల అంచనా ప్రకారం 2500 సంవత్సరానికి భావితరాల వాళ్లు ఇప్పటి వాతావారణ పరిస్థితులను చూడలేరని, వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అంటే 1500 సంవత్సరం నాటికి భూమిపై ఉన్న వాతావరణ పరిస్థితులకు 2020 నాటి పరిస్థితులకు ఎన్నో మార్పులు వచ్చాయి. అలాగే 2500 సంవత్సరం నాటికి పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయట. 2100 దాటేసరికి అటవీ భూములన్నీ బీడుగా మారిపోతాయి. విపరీతమైన కర్భన ఉద్గారాల వల్ల పండే పంటల్లో తేడాలొస్తాయి. అమెరికా లాంటి మిడ్‌‌ వెస్ట్‌‌ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కజొన్న వంటి పంటలు పండే చోటులో ఆయిల్‌‌ పంటలు పండించాల్సి వస్తుంది. వీటిని విజువలైజ్‌‌ చేస్తూ షాకింగ్‌‌ పిక్చర్స్‌‌ని కూడా రివీల్‌‌ చేశారు సైంటిస్టులు.

Tagged India, Scientists, temperature, weather, green house

Latest Videos

Subscribe Now

More News