సముద్రంలో సైలెంట్ హంటర్ ‘ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మంగ్రోల్’.. ఇండియన్ నేవీలోకి కొత్త వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎంట్రీ

సముద్రంలో సైలెంట్ హంటర్   ‘ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మంగ్రోల్’.. ఇండియన్ నేవీలోకి కొత్త వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎంట్రీ
  •     శత్రు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెరైన్లకు ఇక వణుకే

 
ముంబై: ఇండియన్​ నేవీలోకి కొత్త వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఎంట్రీ ఇచ్చింది. భారత నౌకాదళం తన సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా మరో ముందడుగు వేసింది. సముద్ర గర్భంలో శత్రు సబ్​మెరైన్లకు వణుకు పుట్టించేందుకు నయా సైలెంట్ హంటర్​ వచ్చేసింది. సోమవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మూడో యాంటీ-సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెరైన్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యు-ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యుసీ) ‘ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మంగ్రోల్’  నేవీలోకి అధికారికంగా ప్రవేశించింది. 

ఈ ప్రోగ్రామ్​కు వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్- చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయాన్ అధ్యక్షత వహించారు. పెద్ద యుద్ధనౌకలు వెళ్లలేని లోతు తక్కువ తీర ప్రాంతాల్లో ఈ వార్​షిప్​ఈజీగా పనిచేస్తుంది. పోర్టులు, రేవులు, తీర ప్రాంత భద్రతను పర్యవేక్షించడంతో పాటు, నీటి అడుగున నిఘా ఉంచడం, తక్కువ తీవ్రత కలిగిన నౌకాదళ కార్యకలాపాల్లో ‘ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మంగ్రోల్’ కీలక పాత్ర పోషించనుంది.

80 శాతానికిపైగా స్వదేశీ టెక్నాలజీతో..

కొచ్చిన్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యార్డ్ లిమిటెడ్ (సీఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 8 జలాంతర్గామి నిరోధక నిస్సార జల నౌకల్లో(ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యు-ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యుసీ) ఐఎన్ఎస్ మంగ్రోల్ మూడోది. 2026 ఆగస్టు 22న ఈ నౌకను భారత నౌకాదళానికి అప్పగించారు. 

అప్పగింత పత్రాలపై సీఎస్ఎల్ డైరెక్టర్ హరికృష్ణన్, ఐఎన్ఎస్ మంగ్రోల్ నియమిత కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ శరణ్ కుమార్ సంతకాలు చేశారు. 80 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో రూపొందిన ఈ నౌక భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా సాధిస్తున్న పురోగతికి నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. స్వదేశీ యుద్ధనౌకల డిజైన్, నిర్మాణం, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, సెన్సర్ల అనుసంధానంలో దేశం సాధిస్తున్న సాంకేతిక సామర్థ్యాలకు ఇది అద్దం పడుతోందన్నారు.

వారసత్వం కంటిన్యూ..

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తీరప్రాంత పట్టణం ‘మంగ్రోల్’ పేరును దీనికి పెట్టారు. మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వీపర్ నౌక ‘ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ మంగ్రోల్ (ఎం85)’ (2004 ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిటైర్) వారసత్వాన్ని ఇది కొనసాగిస్తుంది. గుజరాత్ తీరప్రాంతంలో జలాంతర్గామి బెదిరింపులను అరికట్టడానికి ఇందులో అభయ్ హల్- మౌంటెడ్ సోనార్, లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెయిట్ టార్పెడోలు, స్వదేశీ యాంటీ- సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెరైన్ రాకెట్ లాంచర్, ‘మరీచ్’ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టార్పెడో డికాయ్ సిస్టమ్స్ ఉన్నాయి.