బీఎఫ్.7 వేరియంట్ను ఐసోలేట్ చేసిన భారత్

బీఎఫ్.7 వేరియంట్ను ఐసోలేట్ చేసిన భారత్

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’ దడ పుట్టిస్తోంది.  మళ్లీ  కొవిడ్ ముప్పు ముసురుకోవచ్చనే భయాలకు బీజాలు వేస్తోంది. ఒమైక్రాన్ వేరియంట్ రకానికి చెందిన ఈ డేంజరస్ సబ్ వేరియంట్ (బీఎఫ్.7) శాంపిల్ ను భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా ఐసోలేట్ చేశారు.  భారత ప్రభుత్వ వర్గాలు ఈవిషయాన్ని వెల్లడించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ‘బీఎఫ్.7 వేరియంట్’ శాంపిల్ పై పనిచేస్తాయా ? లేదా ? అనేది తెలుసుకునే దిశగా ప్రయోగాలను ప్రారంభించినట్లు తెలిపాయి.

ప్రస్తుతం చైనాను కుదిపేస్తున్న కరోనా వేరియంటే ఇదే. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు మన దేశంలో దీనికి సంబంధించిన 4 కేసులే బయటపడ్డాయి. వీటిలో 3 కేసులు గుజరాత్ లో, ఒకటి ఒడిశాలో వెలుగుచూశాయి. ఈ బాధితుల్లో కొందరిలో తేలికపాటి కొవిడ్ లక్షణాలే కనిపించగా, ఇంకొందరిలో లక్షణాలు కొంచెం కూడా బయటపడలేదు. అయితే కొన్నివారాల చికిత్స అనంతరం వారంతా పూర్తిస్థాయిలో కోలుకున్నారు.