జపాన్ జాబిలి మిషన్ కు మన ల్యాండర్‌‌‌‌

జపాన్ జాబిలి మిషన్ కు మన ల్యాండర్‌‌‌‌

న్యూఢిల్లీ: చంద్రయాన్​2 మిషన్​లో ల్యాండింగ్​ ఫెయిలైనా.. రెట్టించిన ఉత్సాహంతో మరో మూన్​ మిషన్​కు ఇండియా సిద్ధమవుతోంది. జపాన్​ స్పేస్​ ఏజెన్సీ జాక్సా, ఇండియన్​ స్పేస్​ రీసెర్చ్​ ఆర్గనైజేషన్​ (ఇస్రో) కలిసి లూనార్​ పోలార్​ ఎక్స్​ప్లొరేషన్​(ఎల్​పీఈ) మిషన్​ను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్​లో ఇస్రోనే కీలక పాత్ర పోషించనుంది. ప్రయోగానికి సంబంధించిన ల్యాండర్​ సిస్టమ్​ను ఇస్రోనే తయారు చేయనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను జాక్సా వెల్లడించింది. 2022లో ఇస్రో ప్రతిష్టాత్మక గగన్​యాన్​ మిషన్​ ఉన్నందున 2023లో ఎల్​పీఈ మిషన్​ చేపట్టనున్నట్టు జాక్సా ప్రకటించింది. ఈ ప్రయోగంలోనూ ల్యాండర్​, రోవర్​లుంటాయని చెప్పింది. ల్యాండింగ్​ మాడ్యూల్​, రోవర్​ను జాక్సానే తయారు చేయనుండగా, ఆ ల్యాండింగ్​ సిస్టమ్​ను మాత్రం ఇస్రో డెవలప్​ చేయనుంది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్​ తయారుచేసిన హెవీ రాకెట్​ హెచ్​3తో ఎల్​పీఈ ప్రయోగం చేయనున్నారు. జపాన్​ నుంచే లాంచ్​ చేస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రాజెక్ట్​ టీమ్​.. కొలాబరేటివ్​ మిషన్​ను సమగ్రంగా నిర్వహించే విధానంపై పనిచేస్తోంది. అందులో భాగంగా స్పేస్​క్రాఫ్ట్​ సిస్టమ్​ అవసరాలు, ఇంకొన్ని ఇంటర్​ఫేస్​ స్పెసిఫికేషన్స్​పై ఇస్రో సాయం తీసుకుంటోంది.

మిషన్​ ఆబ్జెక్టివ్​ ఏంటి?

మునుపటి మిషన్​లలాగే చందమామపై నీటి జాడలను గుర్తించేందుకు ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఉన్న అబ్జర్వేషన్ల ద్వారా కచ్చితమైన నీటి పరిమాణాన్ని తెలుసుకోవడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. మిషన్​ కోసం చంద్రుడి ధ్రువాలను టార్గెట్​గా చేసుకున్నారు. ధ్రువాల వద్ద నీళ్లు ఎంతమేర విస్తరించి ఉన్నాయి.. దాని పరిస్థితులు, ఏ రూపంలో ఉన్నాయి.. వంటి వివరాలనూ ఈ ప్రయోగం ద్వారా తేల్చనున్నారు. శాశ్వతంగా చీకటి ఉండే ప్రాంతాల్లో (పీఎస్​ఆర్​) నీళ్లు సబ్​లైమేట్​ (గడ్డకట్టిన లేదా క్రిస్టల్​) రూపంలో లేవంటూ ఇటీవలి స్టడీల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తేల్చేందుకే ఇస్రో, జాక్సాలు కలిసి ఈ ప్రయోగం చేస్తున్నాయి.

ఇంటర్నేషనల్​ కొలాబరేషన్​లో భాగంగా ఇస్రోతో కలిసి ఎల్‌పీఈ మిషన్​ చేపట్టాం. భవిష్యత్​ ప్రయోగాలకు అక్కడ గుర్తించిన వనరులను ఎలా వాడుకోవచ్చో ఈ మిషన్​లో తేలుస్తాం. అంతేగాకుండా భవిష్యత్​ చంద్రుడి ప్రయోగాల కోసం తక్కువ గురుత్వాకర్షణ ఉన్న అంతరిక్ష గ్రహాలు, గ్రహ శకలాల ఉపరితలాలను స్టడీ చేసేందుకు టెక్నాలజీని అభివృద్ధి చేస్తాం. కెమికల్​ ఎలిమెంట్స్​ (రసాయన మూలకా లు) అబ్జర్వేషన్​ కోసం రోవర్​ను తయారు చేస్తున్నాం. హైడ్రోజన్​ ఆనవాళ్లు కనిపిస్తే ఆ శాంపిళ్లను రోవర్​ తీసుకుంటుంది. వాటిని అక్కడే హీట్​చేసి ఆవిరిగా మార్చడం ద్వారా అందులోని రసాయన మూలకాలు, నీటి పరిమాణం, ఐసోటోపిక్​ అనాలసిస్​ చేస్తాం.

– జాక్సా, జపాన్​ స్పేస్​ ఏజెన్సీ

వివాదంలోని 3 ప్రాంతాలతో నేపాల్ కొత్త మ్యాప్